గరిష్టంగా 15 వేల డాలర్ల వరకు పత్రాలు సమర్పించాలి : అమెరికా తాజా నిబంధన
వాషింగ్టన్ : అమెరికాకు వ్యాపార, పర్యాటక వీసాలపై వెళ్లాలని అనుకునే వారు ఆ దేశంలో ప్రవేశించాలంటే గరిష్టంగా పదిహేను వేల డాలర్ల వరకూ బాండ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతిపాదించిన ఈ నిబంధన చాలా మంది దరఖాస్తు దారులకు శరాఘాతం కాబోతోంది. అమెరికా ఫెడరల్ రిజిస్టరులో మంగళ వారం ప్రచురితమైన నోటీసు ప్రకారం.. అధిక ఓవర్‌స్టే (తాత్కాలిక వీసాలపై అమెరికాకు వచ్చి అక్రమంగా ఎక్కువ కాలం నివసించడం) రేటు టు ఉన్న దేశాలు, భద్రతా ప్రమాణాలకు సంబం ధించిన పత్రాలు సరిగా లేని దేశాలకు చెందిన వారు వీసా కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఐదు వేల డాలర్లు లేదా పదివేల డాలర్లు లేదా పదిహేను వేల డాలర్ల బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది. దీనిని 12 నెలల పైలెట్ కార్యక్రమంగా చేపడతారు. ఇది ఈ నెల 20వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ప్రస్తుతానికి బీ-1 బిజినెస్, బీ-2 టూరిస్ట్ వీసాలకు ఇది వర్తిస్తుంది.
నిబంధనలన్నింటినీ పాటించి స్వదేశానికి వెళ్లేటప్పుడు బాండ్ మొత్తాన్ని తిరిగి వాపసు చేస్తారు. అనుమతించిన దాని కంటే ఎక్కువ కాలం అమెరికాలో ఉంటే వారు తమ బాండ్ మొత్తాన్ని కోల్పోతారు. ఛాద్, ఎరిత్రియా, హైతీ, మయన్మార్, యమన్, బురుండి, డిబౌటీ, టోగో దేశాలకు చెందిన వారు అమెరికాలో అనుమతించిన దాని కంటే ఎక్కువ కాలం నివసిస్తున్నారు. వీసా దరఖాస్తు నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేస్తున్న విషయం తెలిసిందే. వీసా పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసే వారు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుందని గత వారం విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. గతంలో ఈ నిబంధన లేదు. అంతేకాక వీసా డైవర్సిటీ లాటరీ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసే వారు విధిగా పాస్‌పోర్టును కలిగి ఉండాలి.న
వీసా కావాలంటే బాండ్ ఇవ్వాల్సిందే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES