ఎస్ఓ టు జిఎం బి శ్రీనివాస చారి
నవతెలంగాణ – మణుగూరు
పనిలో పదోన్నతికి తగ్గ ప్రతిభను చూపాలని మణుగూరు సింగరేణి ఏరియా ఎస్ ఓ టు జి ఎం బి శ్రీనివాస్ చారి అన్నారు. గురువారం మణుగూరు ఏరియా పీకే ఓ సీ 2 బేస్ వర్క్ షాప్ నందు కొత్తగూడెం రీజియన్ స్థాయిలో విధులు నిర్వహిస్తు, తగిన అర్హత గల డి గ్రేడ్ ఈ పి ఆపరేటర్లకు అంతర్గత సి గ్రేడ్ ఈ పి ఆపరేటర్ల పదోన్నతుల భర్తీకి రెండవ రోజు ఇంటర్వ్యూ నిర్వహించారు. ఏ ఉద్యోగి కైనా పదోన్నతి కర్తవ్య నిర్వహణ బాధ్యతను మరింత పెంచుతుందని, తద్వారా వ్యక్తిగతంగా తను వృత్తిపరంగా సంస్థ పురోగతికి పాటు పడాలని ఏరియా ఎస్ టు జిఎం బి. శ్రీనివాస చారి అన్నారు.
ఈ కార్యక్రమానికి ఎస్ఓ టు జిఎం బి శ్రీనివాస చారి కమిటీ కన్వీనర్ గా పాల్గొని మాట్లాడారు. కొత్తగూడెం రీజియన్ స్థాయిలో మణుగూరు, సత్తుపల్లి, కొత్తగూడెం మరియు ఇల్లెందు ఏరియాలలో పనిచేస్తున్న రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి దరఖాస్తు చేసుకున్న డి గ్రేడ్ ఆపరేటర్లు ఈనాటిఇంటర్వ్యూలకు హాజరయ్యారని అన్నారు. ఏరియా ఎస్ ఓ టు జి ఎం బి. శ్రీనివాస చారి పర్యవేక్షణలో ఈ రోజు జరిగిన ఈ బెస్ట్ కు 32 మంది హాజరు అయ్యారు. కంపెనీ నిభందనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా నిర్వహించబడిన ఈ టెస్ట్ లో అభ్యర్ధుల ప్రతిభా పాటవాల ప్రాదిపదికన మెరిట్ లో వచ్చిన అభ్యర్థులకు త్వరలో సి గ్రేడ్ ఈ పి ఆపరేటర్ల పదోన్నతుల సమాచారం అందించడం జరుగుతుందని డిజిఎం ఏర్పనల్ పర్సనల్ మేనేజర్ ఎస్ రమేష్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజినీర్ శ్రీనివాస్ ఏటిఎం పర్సనల్ కార్పొరేట్ రాజేంద్ర ప్రసాద్ డిజిఎం పర్సనల్ ఎస్ రమేష్ పి ఈ పీకే ఓ సి వీరభద్రుడు ఎస్ ఈ సుదర్శన్ రెడ్డి డిప్యూటీ ఎస్ఈ సిహెచ్ వెంకటేశ్వర్లు, ఈ ఈ లు సతీష్ శ్రావణ్ కుమార్ సింగు శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు.