భారతీయ విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్, తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లోని భారతీయ విద్యార్థులకు సూచించారు. భారతీయ విద్యార్థుల ఆహ్వానం మేరకు గురువారం యూనివర్సిటీ ప్రాంగణంలో వారు చదువుకుంటున్న స్కూల్‌లో సమావేశమయ్యారు. ఆ విద్యార్థులు కెరీర్‌ను సాధించేందుకు ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై చర్చించిన ఆయన తాను ఎలా విజయం సాధించారో వారికి వివరించారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను వారికి తెలిపిన ముఖ్యమంత్రి, వారి ప్రతిభ, నెట్ వర్క్‌ను ఉపయోగించి భారతదేశ వృద్ధికి సహకరించాలని కోరారు. హైదరాబాద్, తెలంగాణలో ఉన్న అవకాశాలను, ప్రత్యేకతలను ప్రచారం చేసి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని అన్నారు.
తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్స్‌గా మారాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



