మునుకుంట్ల సర్పంచ్ గుల్లి నరేష్
నవతెలంగాణ – కట్టంగూర్
పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు అధికమార్కుల సాధించి గ్రామానికి గుర్తింపు తేవాలని మండలంలోని మునుకట్ల గ్రామ సర్పంచ్ గుల్లి నరేష్ అన్నారు. మంగళవారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు దాతల సహకారంతో పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాల నుండి మండల స్థాయిలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కడారి మల్లేష్, బిజెపి నాయకులు ముడుసు బిక్షపతి, దాత నిమ్మనగోటి జలంధర్, గంగనబోయిన వీరాంజనేయులు, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు చంద్రశేఖర్, వెంకటయ్య,మారయ్య ఉన్నారు.
పది ఫలితాల్లో అధిక మార్కులు సాధించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



