Friday, November 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుక్లైమాక్స్‌ చూసి షాక్‌ అవుతారు

క్లైమాక్స్‌ చూసి షాక్‌ అవుతారు

- Advertisement -

అఖిల్‌ రాజ్‌, తేజస్విని జంటగా నటించిన సినిమా ‘రాజు వెడ్స్‌ రాంబాయి’. ఈటీవీ విన్‌ ఒరిజినల్స్‌ ప్రొడక్షన్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్‌ ఫిలింస్‌, మాన్‌ సూన్స్‌ టేల్స్‌ బ్యానర్స్‌ పై వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నేడు (శుక్రవారం) వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, బన్నీ వాస్‌ వర్క్స్‌ బ్యానర్స్‌ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలో మేకర్స్‌ నిర్వహించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ, ‘హీరో అఖిల్‌ బాగా నటించాడు, తేజస్వినీ మన పొరుగు అమ్మాయి అనేంత సహజంగా ఉంది. డైరెక్టర్‌ సాయిలును చూసినప్పుడు అతనిలో నిజాయితీ కనిపించింది. ఈ మూవీ ట్రైలర్‌ చూస్తుంటే ప్రతి షాట్‌ కొత్తగా అనిపించింది. నేను చాలా దారుణాలు విన్నాను. కానీ వీళ్లు వచ్చి సినిమా క్లైమాక్స్‌ గురించి చెప్పినప్పుడు షాక్‌ అయ్యాను. నాలాగే ప్రేక్షకులూ షాక్‌ అవుతారు’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -