- Advertisement -
నవతెలంగాణ- హైదరాబాద్: గుంటూరుకు చెందిన యువ వైద్యురాలు డాక్టర్ రోహిణి హైదరాబాద్ లోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..డాక్టర్ రోహిణి గత ఏడాది కాలంగా అమెరికాలో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) చేసేందుకు జే1 వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇటీవల ఆమె వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైంది. దీంతో తన భవిష్యత్ ఆశలు అడియాసలయ్యాయని భావించిన ఆమె, తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై, నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న రోహిణి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
- Advertisement -


