నవతెలంగాణ- దుబ్బాక : ఆర్థిక ఇబ్బందులతో యువరైతు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన అక్బరుపేట భూంపల్లి మండలం చిట్టాపూర్ లో శుక్రవారం రాత్రి జరిగింది. భూంపల్లి ఎస్ఐ హరీష్ గౌడ్ తెలిపిన వివరాలు.. ఇదే గ్రామానికి చెందిన గంగాల పరశురాముడు (40) తనకున్న ఎకరంనర పొలంలో వ్యవసాయం చేసుకుంటూ భార్య, పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నారు. కొంతకాలంగా పంట దిగుబడి బాగా రాకపోవడం, కుటుంబ పోషణ భారమై, ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా మనస్థాపం చెందాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో గొడవ పెట్టుకుని బయటకు వెళ్తున్నానని చెప్పి ఎంతకీ తిరిగి రాలేదు. సొంత పొలం వద్దనున్న ఓ చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి భార్య రేణుకకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దుబ్బాకలోని ప్రభుత్వ ఏరియా వంద పడకల ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
యువ రైతు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES