నవతెలంగాణ – దుబ్బాక: పంటలు బాగా పండుతాయన్న ఆశతో 2 బోర్లు వేసినా.. పంటలు సరిగా చేతికి రాకపోవడంతో అప్పులపాలైన ఓ యువ రైతు.. ఎలా తీర్చాలో అన్న మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన దుబ్బాక మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి 4 వ వార్డులో మంగళవారం జరిగింది. ఇదే వార్డుకు చెందిన అండ రవీందర్ (36) తండ్రి ఈశ్వర్ రెడ్డి వృత్తిరీత్యా వ్యవసాయం చేసుకుంటూ తల్లి విజయ, భార్య రమ్యకృష్ణ, కూతురు వైష్ణవి, కుమారుడు వంశీ లతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. తమ్ముడైన రమేష్ రెడ్డికి కూతురు పుట్టగా..ఈనెల 3న చూసి వస్తానని చెప్పి భార్య రామకృష్ణ ధర్మారం వెళ్ళిపోయింది. ఈనెల 5న తల్లి విజయ మనవడు, మనవరాళ్లను తీసుకొని కొండపాక లోని బంధువుల ఇంటికి వెళ్ళింది. దీంతో ఒంటరిగా ఉన్న రవీందర్ రెడ్డి ఇంట్లోని ఓ గదిలో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతకీ డోర్లు తెరవకపోవడంతో గమనించిన బంధువులు, స్థానికులు తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి రవీందర్ రెడ్డి ఉరేసుకుని చనిపోయాడు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఉరేసుకుని యువరైతు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES