Sunday, October 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య

అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ-దుబ్బాక
వ్యవసాయంలో పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ కె.కీర్తిరాజు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక పట్టణ కేంద్రానికి చెందిన జమునగారి ప్రవీణ్‌ కుమార్‌(33) వ్యవసాయంతోపాటు హార్వెస్టర్‌ డ్రైవర్‌గా పనిచేసేవాడు. భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులతో కలిసి జీవనం కొనసాగించాడు. కొంతకాలంగా వ్యవసాయం, ఇతర అవసరాల కోసం రూ.8 లక్షల వరకు అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. శుక్రవారం రాత్రి తన వ్యవసాయ పొలం వద్ద ప్రవీణ్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య భవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -