6.5 కిలోల గంజాయి స్వాధీనం
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉపయోగపడు వద్ద 6.5 కిలోల గంజాయిని పట్టుకొని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ ఇన్ఫోసిమెంట్ సీఐ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని సుభాష్ నగర్ లో గల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.
మహారాష్ట్ర లోని బోకర్ తాలూకా నుంచి నిజామాబాద్ కు గంజాయి రవాణా చేస్తు క్రయ విక్రయాలు చేస్తున్న యువకుడిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఖిల్లారోడ్ లోని అమన్ నగర్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో షేక్ మీరాజ్ అనే యువకుడు బైక్ పై వెలుతుండగా తనిఖీ చేశారు. అతని వద్ద 6.5 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని బోకర్ తాలూకా కు చెందిన ఫారుఖ్ ఖురేషీ నుంచి నిజామాబాద్ కు చెందిన మేరాజ్ గంజాయి కొనుగోలు చేసి స్థానికంగా విక్రయాలు చేస్తున్నట్టు విచారణలో తెలిందని ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ తెలిపారు. ఫారుక్ పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఈ తనిఖీలలో ఎస్ఐ నర్సింహచారీ, సిబ్బంది విష్ణూ, భూమన్న, అవినాష్, బోజన్న, ఉత్తమ్, శ్యామ్ తదితరులు ఉన్నారు.