- Advertisement -
నవతెలంగాణ-నిజాంసాగర్
తరచుగా ఫోన్ మాట్లాడొద్దన్నందుకు తండ్రి మందలించడంతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో జరిగింది. ఎస్‌ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న ఆరెపల్లి గ్రామానికి చెందిన రాకేష్(20) ఫోన్ ఎక్కువగా మాట్లాడేవాడు. ఈ క్రమంలో తండ్రి గంగారం తరచుగా ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావని మందలించాడు. దాంతో మనస్తాపం చెందిన రాకేష్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి గంగారం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -