నవతెలంగాణ-వెల్దుర్తి
నిశ్చితార్థం జరిగి పెండ్లి క్యాన్సల్ కావడంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఏదులపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఏదులపల్లికి చెందిన దాసరి విజరు (24)కి కొద్దిరోజుల క్రితం తమ బంధువుల అమ్మాయితో పెండ్లి సంబంధం కుదిరి నిశ్చితార్థం జరిగింది. కానీ పెండ్లి క్యాన్సిల్ అయింది. దాంతో మనస్థాపానికి గురైన విజరు గురువారం మధ్యాహ్నం తమ వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు, గ్రామస్తులు విజరుని చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజరు శుక్రవారం మృతిచెందారు. మృతునికి సోదరుడు ఉన్నారు. విజరు మృతితో ఏద్దులపల్లిలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి.
పెండ్లి రద్దయ్యిందని యువకుడు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



