నవతెలంగాణ – నవాబుపేట
మండల పరిధిలోని గురుకుంట గ్రామానికి చెందిన బోవళ్ళ గణేష్ (21)తన తండ్రి మందలించాడని తీవ్ర మనస్థాపానికి గురై తన వ్యవసాయ పొలంలో రేకుల షెడ్డకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం గణేష్ తన స్నేహితులతో గొడవ పడ్డారని తండ్రి గణేష్ ను మందలించారు. ఈ క్రమంలో గణేష్ శుక్రవారం రాత్రైనా ఇంటికి రాకపోవడంతో తండ్రి విరన్న ఫోన్ చేసి అడిగాడు. అందుకు బదులుగా తాను నవాబుపేటలో ఉన్నానని, ఇంటికి వస్తానని చెప్పాడు. అయితే అనూహ్యంగా శనివారం ఉదయం తన పొలంలోని రేకుల షెడ్డుకు ఉరేసుకుని చనిపోయాడు. వెంటనే స్థానికులు గణేష్ తండ్రికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు.
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



