- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు:మండలంలో మల్లారం గ్రామానికి చెందిన కలువల నాగరాజు (23) అనే యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.కుటుంబ సభ్యుల,గ్రామస్తుల పూర్తి కథనం ప్రకారం నాగరాజు తన తండ్రి మొగిలితో కలిసి మానేరు ప్రాంతంలోని పొలంవద్ద ఉన్న మోటార్ తీయడానికి వెళ్లినట్లుగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఉరుముల,మెరుపులతో కూడిన వర్షం వచ్చి ఒకేసారి నాగరాజుపై పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందినట్లుగా తెలిపారు.నాగరాజు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి
- Advertisement -