నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని తుక్కాపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంటుంది. పోలీసులు, స్థానికులు తెలిపి వివరాల ప్రకారం తుక్కాపురం గ్రామానికి చెందిన రాసాల భాగ్యమ్మ @ లలిత ఉదయం 6 గంటలకు తన కొడుకు ఇంకా నిద్ర లేవలేదని తను పడుకున్న గది తలుపులు తెరచి చూసింది. అయితే అప్పటికే తన కుమారుడు రాసాల మధు( 23 ) చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయాడు. దీంతో ఆమె గుండెలవిసేలా ఏడ్చింది. కొడుకు ప్రేమించిన అమ్మాయి వివాహం అయిందని , అప్పులు ఎక్కువ ఉన్నాయన్న మనస్థాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. తన కొడుకు మరణంపై ఎవరి మీద అనుమానం లేదని తెలిపింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఉరేసుకుని యువకుడు మృతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES