- Advertisement -
నవతెలంగాణ-సారంగాపూర్: మండలంలోని మహబూబ్ ఘాట్ లొద్ది దర్గా సమీపంలో ఆదిలాబాద్ జిల్లా నేరడికొండ గ్రామానికి చెందిన అల్వే చరణ్ (25)అను యువకుడు గురువారం చెట్టుకు ఉరి వేసుకొని మృతిచెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.మృతుడు గత కొన్ని రోజుల నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. నిన్న మధ్యాహ్నం నిర్మల్ వెళ్లి వస్తానని ఇంట్లో నుండి బయలుదేరి ఇంటికి రాలేదని మృతుడి అన్నయ్య సాయికుమార్ ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
- Advertisement -



