- Advertisement -
మృతునికి 21 రోజుల కుమారుడు
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని వండ్రికల్ గ్రామ శివారులో గల కోల్ మత్తడి ఒర్రె వద్ద అదే గ్రామానికి చెందిన వేముల కిషన్ రావు (25) మేకలకు మేత నిమిత్తం వండ్రికల్ గ్రామ శివారుకు వెళ్లాడు. ఈ క్రమంలో మత్తడి ఒర్రె దగ్గర గల మేత కోసం మేడి చెట్టు ఎక్కాడు. అయితే చెట్టు మధ్యలో ఉన్న 11 KV వైర్లు తగిలి చెట్టుపైనే అక్కడికక్కడే చనిపోయాడు. కాగా.. మృతునికి 21 రోజుల కుమారుడు ఉన్నాడు. తండ్రి శ్యామ్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.
- Advertisement -



