Monday, January 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆన్‌లైన్ బెట్టింగ్‌కి యువ‌కుడు బ‌లి

ఆన్‌లైన్ బెట్టింగ్‌కి యువ‌కుడు బ‌లి

- Advertisement -

నవతెలంగాణ- రెంజల్: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో ఆన్‌లైన్ బెట్టింగుల‌తో న‌ష్ట‌పోయి ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. కూనేపల్లి గ్రామానికి చెందిన పెరుమండ్ల సంజయ్(28) అప్పుల బాధ భరించలేక సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని మృతి చెందినట్లు రెంజల్ ఎస్సై కే. చంద్రమోహన్ తెలిపారు. మృతుని తండ్రి పెరుమండ్ల కిష్టయ్య ఇచ్చిన ఫిర్యాదు ప్ర‌కారం.. తన కుమారుడు గ్రామంలో సుమారు రెండున్నర లక్షల వరకు అప్పుచేసి, ఆ నగదుతో ఆన్లైన్ బెట్టింగులు పెట్టి, నష్టపోయి అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన పేర్కొన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -