– అప్పులపాలై ఆత్మహత్య
నవతెలంగాణ-కామారెడ్డి
ఆన్‌లైన్ గేమ్స్‌కు ఓ యువకుడు బలయ్యాడు. వాటికి అలవాటు పడి చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. కామారెడ్డి పట్టణ సీఐ నరహరి వివరాల ప్రకారం.. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఓం శాంతి కాలనీకి చెందిన శ్రీకర్ (30) అనే యువకుడు ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, ఏడాదిన్నర నుంచి ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ అప్పులు చేశాడు. అప్పులు భరించలేక ఇల్లు అమ్మి కొంత తీర్చాడు. మరిన్ని అప్పులు ఉండటంతో అవి తీర్చే దారిలేక జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి వల్లందేసి గోదావరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆన్‌లైన్ గేమ్స్‌కు యువకుడు బలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



