Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్తర్ణం వాగులో యువకుడు గల్లంతు

తర్ణం వాగులో యువకుడు గల్లంతు

- Advertisement -

బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తున్న వరద
నవతెలంగాణ-జైనథ్‌

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం తర్ణం వాగు తాత్కాలిక బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తున్న వరదలో కొట్టుకుపోయి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ విషాద సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మిపూర్‌ గ్రామానికి చెందిన దత్తు(30) వడ్రంగి పని నిమిత్తం రోజూ ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి వెళ్లేవాడు. మంగళవారం రాత్రి పని ముగించుకొని లక్ష్మిపూర్‌ గ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. అయితే, సాయంత్రం కురిసిన వర్షానికి ఇటీవల తాత్కాలికంగా నిర్మించిన తర్ణం బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తోంది. చికటిగా ఉండటంతో వరదను గమనించక దత్తు వంతెన పైనుంచి వెళ్లడానికి యత్నించాడు. అదుపుతప్పి ద్విచక్ర వాహనం పడిపోవడంతో వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. బుధవారం ఉదయం నుంచి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినా రాత్రి వరకు కూడా ఆచూకీ దొరకలేదు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img