నవతెలంగాణ – అశ్వారావుపేట : సేవాభావం ఉన్న యువత ఏ గ్రామానికి ఐనా అస్త్ర శస్త్రాలు. చిన్న ఆలోచన పెద్ద మార్పునకు దారితీస్తుందని నమ్మిన జమ్మిగూడెం యువజన సంఘం సభ్యులు చిరంజీవి, సాయి, వెంకన్న లు ముందుకొచ్చి ఒక మనసైన సేవా కార్యక్రమం చేపట్టారు.విద్యార్థులు మంచి భవిష్యత్తు నిర్మించు కోవాలంటే అవసరమైన కనీస పాఠ్య సరంజామా అందుబాటులో ఉండాలని భావించి, తెలుగు, ఇంగ్లీషు కాపీ రైటింగ్ నోట్ బుక్స్ ను స్వీయ వ్యయంతో కొనుగోలు చేసి పాఠశాలకు అందజేశారు. స్థానిక ఎంపీయూపీఎస్ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. విద్యార్థులు నవ్వులు చిందిస్తూ బహుమతులు స్వీకరించారు. ప్రధానోపాధ్యాయులు రవికుమార్ మాట్లాడుతూ “ఈ తరహా చిన్న చిన్న చేయూత లే విద్యార్థుల కలలకు బలం.గ్రామ యువత ముందుకు రావడం అభినందనీయం” అన్నారు. అలాగే విద్యార్థుల చదువులో అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరగాలని కోరుకున్నారు. యువకులు చిరంజీవి, సాయి, వెంకన్న లు మాట్లాడుతూ.. “విద్యార్ధులే మన గ్రామ భవిష్యత్తు. వారిలో నేర్చుకునే తపన పెరుగితే గ్రామం ముందుకు సాగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తృతంగా చేపడతాం” అని తెలియజేశారు. సమాజానికి సేవ చేయాలనే తపనతో ముందుకొచ్చిన యువతను గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది కే.హరినాథ్, ఎస్.నాగేశ్వరరావు, బి.రమేష్, పి.శ్రీను, జి.సుజాత, రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గ్రామంలో విద్యా చైతన్యానికి నూతన ఆరంభం గా నిలిచింది. చిన్నారుల ముఖాల్లో వెలిసిన ఆనందమే దీని పెద్ద విజయంగా నిలిచింది.
విద్యార్ధులకు నోట్ బుక్స్ అందజేస్తున్న యువకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



