– విద్య, ఉపాధి హక్కుల కోసం పోరాడాలి : డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్
– నకిరేకల్‌లో యువ చైతన్య సైకిల్ యాత్ర ప్రారంభం
నవతెలంగాణ-నకిరేకల్
సమాజంలో డ్రగ్స్, గంజాయి మాదకద్రవ్యాలు, మద్యపానం వల్ల యువత చెడు వ్యసనాల బారినపడి విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ అన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు రద్దు చేయాలని డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ చైతన్య సైకిల్ యాత్రను గురువారం నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణ కేంద్రంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ డ్రగ్స్, గంజాయి యువతను చెడు మార్గంలో పట్టిస్తున్నాయన్నారు. డ్రగ్స్, గంజాయి బారిన పడుతున్న యువత సామాజిక బాధ్యతలు మరిచి అనేక అఘాయిత్యాలకు పాల్పడుతూ తమ ప్రాణం కూడా పోగొట్టుకుంటోందని చెప్పారు. పాలక ప్రభుత్వాలు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించనం దునే ఇలాంటివి జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువతను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుం టోందని విమర్శించారు. యువత చెడు వ్యస నాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సామాజిక చైతన్యంతో సమాజ అభివృద్ధికి పాటు పడాలని పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాల్లోకి రావాలని కోరారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. యువచైతన్య సైకిల్ యాత్ర రథసారథి మల్లం మహేష్ మాట్లాడుతూ.. ఈ సైకిల్ యాత్ర నకిరేకల్, మునుగోడు, దేవరకొండ, సాగర్, నల్లగొండ నియోజకవర్గాల మీదుగా సాగుతూ ఆగస్టు 2న మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలో ముగుస్తుందని తెలిపారు. ఈ కార్య క్రమంలో డీవైఎఫ్‌ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి రావుల రాజు, జిల్లా అధ్యక్షులు రవి నాయక్, నాయకులు పుల్లెంల శ్రీకర్, పతాని శ్రీను, వడ్డగాని మహేష్, గద్దపాటి సుధాకర్, గుండాల నరేష్, కట్ట లింగస్వామి, వివిధ ప్రజా సంఘాల నాయకులు రాచకొండ వెంకన్న, ఒంటెపాక వెంకటేశ్వర్లు, లకపాక రాజు, దాసరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES