ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎమ్‌డి అబ్బాస్ పిలుపు
అసమానతలపై సామాజిక ఉద్యమం చేపట్టాలి : కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అశాస్త్రీయ భావనలు, మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా సమాజ మార్పు కోసం యువతరం చర్చించాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం డి అబ్బాస్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో సోషల్ మీడియా విభాగం కన్వీనర్ కోట గోపి అధ్యక్షతన వర్క్ షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం డి అబ్బాస్ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో అనేక అబద్ధాలు, మతవిద్వేషాలను ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొడుతున్నారని తెలిపారు. కుల అసమానతలను పెంచి పోషించే విధంగా సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి పథంలో ముందుకు నడవాలంటే యువతరం వాస్తవాలను ప్రచారం చేయాలని సూచించారు.
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక అసమానతలు 12 ఏండ్ల బీజేపీ పాలనలో రెట్టింపయ్యాయని తెలిపారు. మనువాద విష సంస్కృతి, కార్పొరేట్ల ప్రయోజనాలన్నింటిని సామాజిక మాధ్యమాలతో నింపుతున్నారని వివరించారు. వాటిని ఎదుర్కొవటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాలు వివిధ యాప్స్ ప్రయోజనాలపై సోషల్ విభాగం రాష్ట్ర నాయకులు పిట్టల రవి, టి10 చానల్ సీఈవో సుందర్, ప్రొజెక్టర్ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా కార్యక్రమంలో మల్కయ్య అంతటి కాశన్న, గంధం మనోహర్, ఉసిల్ల కుమార్, పాపిట్ల సత్యనారాయణ, బి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.
సమాజ మార్పుపై సోషల్ మీడియాలో యువతరం చర్చించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES