Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రమాదంలో యువత జీవనం..

ప్రమాదంలో యువత జీవనం..

- Advertisement -

అవగహన సదస్సులో రూరల్ సీఐ శ్రీను 
సామాజిక మాద్యమాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు..
గ్రూప్ అడ్మీన్లపై కేసులు నమోదు చేసి రిమాండుకు తరలిస్తామని హెచ్చరిక 
జపాన్ యువత ఆదర్శనీయమని హితవు
మానవ జన్మ విలువైంది..విజ్ఞతతో గడపాలని సూచన 
నవతెలంగాణ – బెజ్జంకి
: విచ్చలవిడిగా సామాజిక మాద్యమాల వినియోగం, మద్యం సేవించడం,మత్తు పదార్థాలకు బానిసలై ప్రమాదంలో యువత జీవనం సాగిస్తోందని.. జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు, తోబుట్టువులను విస్మరించి..సామాజిక మాద్యమాలు ఏవరికోసం వినియోగిస్తున్నారో యువత ఆలోచన చేయాల్సిన అవశ్యకత ఉందని సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ అవరణం యందు సీఐ శ్రీను,ఎస్ఐ తిరుపతి రెడ్డితో కలిసి సామాజిక మాద్యమాల వినియోగం,మద్యం, మత్తుపదార్థాలు,మానవ జన్మ లక్ష్యం,చదువుతో కలిగే ప్రయోజనాలు,సమాజం పట్ల వ్యవహరించే తీరుపై బేగంపేట,వడ్లూర్ గ్రామ యువతకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సీఐ శ్రీను మాట్లాడారు. ప్రపంచానికి జపాన్ యువత ఆదర్శనీయమని..ప్రతి యువత నిత్యం సుమారు 19 గం. కష్టపడి పనిచేస్తారని హితవు పలికారు.మండలంలో యువత సామాజిక మాద్యమాలతో విజ్ఞత,సంస్కారం కొల్పోయి పెడదారి పడుతున్నరన్నారు.సమాజం పట్ల అవగాహన కలిగియున్న వారు ప్రజాసేవనే తమ అభిమతమని..నిర్వర్తిస్తే విధులే తమ లక్ష్యమని సూచించారు.యువత లక్ష్యం నిర్దేశించుకుని జీవనం సాగించాలన్నారు.సామాజిక మాద్యమాలు యువత జీవనానికి ప్రమాదమన్నారు.సామాజిక మాద్యమాల్లో ఎవరైనా సమాజంపై,వ్యక్తిగతంగా కించపరిచేల వ్యవహరిస్తే గ్రూప్ అడ్మీన్లపై కేసులు నమోదు చేసి రిమాండుకు తరలిస్తామని హెచ్చరించారు.మానవ జన్మ విలువైనదని..విజ్ఞత,సంస్కారంతో గడపాలని.. అసాంఘిక కార్యకలాపాలు మానవుని జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తాయని హెచ్చరించారు.పోలీస్ స్టేషన్ సిబ్బంది కనుకయ్య,సుధాకర్,సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

జాతిని అగౌరవపరిచేల ప్రణాళిక.. సామాజిక మాద్యమం ద్వారా ఓ జాతిని అగౌరవపరిచే విదంగా ప్రణాళిక ప్రకారం గ్రామంలో కొందరు వ్యవహరిస్తున్నారని సీఐ శ్రీను వద్ద బేగంపేట గ్రామ యువత అవేదన వ్యక్తం చేశారు.యువత అవేదన మేరకు బేగంపేట గ్రామంలో ఏర్పాటుచేసిన సామాజిక మాద్యమ గ్రూప్ అడ్మీన్,అసభ్యంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతామని సీఐ శ్రీను యువతకు హామినిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -