నవతెలంగాణ-మద్నూర్ : ప్రజలు తనపై నమ్మకంతో యువకున్ని గెలిపించుకున్నందుకు ప్రజల కోసమే పనిచేస్తానంటూ మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామ సర్పంచ్ ఎస్ మహేష్ అన్నారు. గ్రామ అభివృద్ధికికృషిచేస్తూగ్రామంలోని మల్లన్న గుడి వద్ద నూతనంగా బోర్ వేయిస్తూ బోరు మోటర్కు పూజలు చేశారు. వేసవికాలంలో ప్రజలకు నీటి కొరత లేకుండా ఉండాలనే మంచి ఆలోచనతో బోర్ వేయించినట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ ఎస్. మహేష్, ఉప సర్పంచ్ కలిసి ప్రజల కోసం ఎప్పుడూ ముందుండే నాయకులుగా ప్రజల్లో నిరూపించుకుంటున్నారు. ప్రజల మధ్యనే ఉంటా.. ప్రజల కోసమే పని చేస్తా అనే మాటలు నిజం చేస్తున్న నాయకుడు మహేష్ అంటున్నారు. గ్రామ ప్రజలుగ్రామంలో సమస్యలు వచ్చినప్పుడు ముందుండి పరిష్కారం చూపించే వ్యక్తిగా నిరూపించుకుంటున్నారు. ఇలాంటి నాయకుడు మన గ్రామానికి ఉండటం నిజంగా గర్వకారణం గా ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.
ప్రజల కోసమే పని చేస్తా యువ సర్పంచ్ ఎస్ మహేష్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



