Monday, November 17, 2025
E-PAPER
Homeక్రైమ్యువతి అదృశ్యం.. కేసు నమోదు 

యువతి అదృశ్యం.. కేసు నమోదు 

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర
షాపింగ్ కోసం ఇంటి నుండి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన పాక యాకమ్మ-యాకయ్య దంపతుల చిన్న కూతురు స్వాతి (20) ఇంటర్ వరకు చదివి, గత మూడేళ్లుగా ఇంటి వద్ద ఉంటుంది. ఈనెల 16 న ఉదయం తల్లిదండ్రులు ఇద్దరూ, తమ కొడుకు అజయ్ తో కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం బావి కాడికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి స్వాతి కన్పించలేదు. దీంతో ఆరా తీయగా అదేరోజు ఉదయం 11 గంటలకు గ్రామానికి చెందిన ఓ మహిళతో కలిసి షాపింగ్ కోసం తొర్రూరు కు వెళ్లిందని తెలిసింది. షాపింగ్ ముగిసిన తర్వాత నాకు పని ఉందని చెప్పడంతో సదరు మహిళ ఒక్కతే ఇంటికి వచ్చింది. దీంతో బంధువులు, స్నేహితుల వద్ద ఎక్కడా వెతికినా కూడా స్వాతి ఆచూకీ లభించలేదు. సోమవారం ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని ఎస్సై కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -