Monday, July 14, 2025
E-PAPER
Homeజిల్లాలుతిమ్మాపురంలో యువతి మిస్సింగ్..

తిమ్మాపురంలో యువతి మిస్సింగ్..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  : భువనగిరి మండలంలోని బిఎన్. తిమ్మాపురం గ్రామానికి చెందిన జిన్నా విఘ్నేష్ తన సోదరి శిరీష తప్పిపోయినట్లు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు రూరల్ ఎస్సై ఏం అనిల్ కుమార్ తెలిపారు.  శిరీష (25) ఈ రోజు ఉదయం ఇంటి వద్ద కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో అదృశ్యం అయిందని తెలియజేశాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పరిసరాల్లో గాలించినా ఆమె ఆచూకీ లభించలేదని తెలిపారు. మిస్సింగ్ సమయంలో ఆమె గులాబీ రంగు లాంగ్ లెంత్ డ్రెస్ ధరించి ఉందని తెలిపారు. ఎత్తు సుమారు 5 అడుగులు, రంగు చామన చాయ కలిగి ఉంది. ఆమె శారీరకంగా, మానసికంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు ఫిర్యాదులో తెలిపారు. విఘ్నేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించామని పోలీసులు  తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -