- Advertisement -
ఎస్సై సన్మానంలో సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్
నవతెలంగాణ – మద్నూర్ : ఎస్సై విజయ్ కొండ రెండు వెండి పథకాలు సాధించడం మండలానికి ఆదర్శమని సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ తెలిపారు. ఈ సందర్బంగా చైర్మన్ శ్రీనివాస్ పటేల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు కలిసి ఎస్సైని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మీ సేవలు అభినందనీయమని ఎస్సైని అభినందించారు. ఈ క్రమంలో నాయకులకు ఎస్ఐ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -