Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మీసేవ ఆపరేటర్లను యథావిధిగా కొనసాగించాలి

మీసేవ ఆపరేటర్లను యథావిధిగా కొనసాగించాలి

- Advertisement -

గుర్రాల బాలకృష్ణ
నవతెలంగాణ – ఆలేరు రూరల్

మండల కేంద్రాలలోని తహసీల్దార్ కార్యాలయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న మీసేవ ఆపరేటర్లను యథావిధిగా కొనసాగించాలని గ్రామపాలన ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి గుర్రాల బాలకృష్ణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నవతెలంగాణ విలేకరి తో ఆయన మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయాల్లో  మీసేవ ఆపరేటర్లు ప్రభుత్వ ఉద్యోగులతో సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు వివిధ సేవలను సమర్థవంతంగా అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆదాయ ధృవపత్రాలు,కుల ధృవపత్రాలు,నివాస ధృవపత్రాలు,పహాణీలు, ఇతర ప్రభుత్వ సేవల కోసం వచ్చే ప్రజలకు మీసేవ ఆపరేటర్లు కీలక సాయాన్ని అందిస్తున్నారని తెలిపారు.

కార్యాలయాల పనితీరు సజావుగా సాగేందుకు వారు వెన్నెముకలా వ్యవహరిస్తున్నారని అన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో మీసేవ ఆపరేటర్లను తొలగించడం లేదా వారి సేవలను నిలిపివేయడం అన్యాయమని, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తలెత్తుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి, వారి సేవలను యథావిధిగా కొనసాగించాలని కోరారు.

అలాగే గౌరవ తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్  లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న మీసేవ ఆపరేటర్లకు గ్రామపాలన ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.ప్రజలకు నిరంతరాయ సేవలు అందించాలంటే అనుభవజ్ఞులైన మీసేవ ఆపరేటర్లను కొనసాగించడం అవసరమని ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ఘాటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -