Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మీ గ్రామానికి దేశస్థాయిలో గుర్తింపు రావాలి 

మీ గ్రామానికి దేశస్థాయిలో గుర్తింపు రావాలి 

- Advertisement -

– మీకు వచ్చే నిధులు విధుల గురించి త్వరలోనే బుక్ లేట్ ఇవ్వడం జరుగుతుంది 
– గ్రామంలోని ప్రజలకు కనీస అవసరాలు కలిగించండి 
– చిన్న గ్రామపంచాయతీలకు, పెద్ద గ్రామ పంచాయతీలకు ఫర్నిచర్ అందిస్తాను 
– ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి 
నవతెలంగాణ –  కామారెడ్డి 

మీ గ్రామాల అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను తయారు చేసుకొని ముందుకు వెళ్లి గ్రామాన్ని అభివృద్ధి చేసి మీపై నమ్మకాన్ని పెట్టుకున్న గ్రామస్తుల నమ్మకాన్ని నిలబెట్టాలని ప్రముఖ వ్యాపారవేత్త విద్యాదాత తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బీబీపేట  మండలంలోని జనగామ గ్రామంలో గల ఆయన నివాసంలో ఆదివారం కామారెడ్డి నియోజకవర్గం లని సర్పంచులతో మాట ముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందిందంటే అది ప్రధానంగా గ్రామాలు అభివృద్ధి చెందుతేనే దేశం అభివృద్ధి చెందుతుందని అందుకు నూతనంగా సర్పంచులుగా ఎన్నికైన మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పుకుంటుంది కానీ అభివృద్ధి మాత్రం చెందడం లేదన్నారు.

మేమే గ్రామాలలో 17 రకాల లక్ష్యాలను ఎంచుకొని ముందుకు సాగాలని అన్నారు. అందులో ప్రధానంగా తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఈ తాగునీటి  కాలుష్యం వల్లనే 80 శాతం రోగాలు వస్తున్నాయని, అందుకు తాగునీటిని అందించడం ప్రధాన బాధ్యతగా ప్రతి గ్రామపంచాయతీ సర్పంచ్ తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో కనీస వసతులు లేని కుటుంబం ఉండకుండా చూడాలని, ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలే కాకుండా ప్రతి పిల్లాడు బడికి వెళ్లి చదువుకునేలా చూడాలని ప్రతి గ్రామంలో విద్యా, వైద్య సౌకర్యం కల్పించడానికి మీరు కృషి చేయాలని నూతన సర్పంచులకు సూచించారు. చైనాలో యువకులకు 25వేల రకాల పనులపై అక్కడ శిక్షణ ఇవ్వడంతో నేడు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. మీ గ్రామం అభివృద్ధి చెందుతుంది అంటే ఏ పనికైనా 90 శాతం సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు. మేఘాలయ రాష్ట్రంలో మావులేం అనే గ్రామం ప్రతి విషయంలో అభివృద్ధి చెందిందని నేడు ఆ గ్రామాన్ని చూడడానికి నెలకు సుమారు రెండు లక్షల వరకు పర్యాటకులు వస్తారని అన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసుకొని తద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేలా చూడాలని వారికి సూచించారు. 
త్వరలో శిక్షణ తరగతులు నిర్వహిస్తాం..
ఈ కార్యక్రమానికి అతిథిగా సుభాష్ రెడ్డి బాల్యమిత్రుడు మెదక్ డి ఆర్ డి ఏ పి డి ఎస్ శ్రీనివాసరావు  మాట్లాడుతూ త్వరలో మీ అందరికీ మీరు మీ విధులు ఎలా నిర్వహించాలో గ్రామాన్ని అభివృద్ధి ఎలా చేసుకోవాలో శిక్షణ తరగతులను నిర్వహిస్తామని వారికి సూచించారు. సర్పంచ్ అంటే గౌరవంగా ఉండాలని రెండు సంవత్సరాల వరకు మీరు గ్రామంలో ఏదో చేస్తారని వారు ఎదురుచూడడం జరుగుతుందని రెండు సంవత్సరాల అనంతరం వారు నూతన సర్పంచి కోసం ఎదురుచూస్తారని సందర్భంగా వారికి గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన గాయకులు మిట్టపల్లి సురేందర్, పాటమ్మ రాంబాబులు హాజరై వారి పాటల ద్వారా నూతన సర్పంచులలో ఉత్తేజని నింపారు. ఈ కార్యక్రమంలో జనగామ గ్రామ సర్పంచి మట్ట శ్రీనివాస్, బిబిపేట సర్పంచ్ ఏదుల అద్విక సాయి,  మహందపూర్ సర్పంచ్ హరీష్, దోమకొండ, బిబిపేట్, మాచారెడ్డి, పల్వాంచ, కామారెడ్డి, సదాశివ నగర్ తదితర మండలాల నుండి 50 మంది సర్పంచులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -