కేటీఆర్ మాటలకు ఎంపీ చామల కౌంటర్
నవతెలంగాణ – ఆలేరు
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ ఒక మీటింగ్ లో తొడలు కొడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆవేశపడుతూ ప్రజలకు అబద్ధాలు చెప్పి మభ్య పెట్టాలని చూస్తున్నావని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం నవతెలంగాణకు పంపిన వీడియో మెసేజ్ ద్వారా ఆయన మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబం పదేళ్ల పాలనలో వేలకోట్లు దోచుకుందని, ప్రజలు గుర్తించే 2023 ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని గద్దె దించారు అన్నారు. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వకపోవడంతో మీ నాయన తెలంగాణ ఉద్యమ కారుని వేషం “కట్టే” ఉద్యమ సమయంలో దళితుడే ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలుసుకోగానే ముఖ్యమంత్రి పదవిని “కొట్టే” వచ్చిన పదవి ద్వారా కమిషన్ల పేరుతో ఇంట్లోకి వేలకోట్లు “తెచ్చే”కట్టే కొట్టి తెచ్చి అని నువ్వు మాట్లాడుతున్న మాటలు కేటీఆర్ నీ కల్వకుంట్ల కుటుంబానికి సరిగ్గా సరిపోతాయని ఎద్దేవా చేశారు.
మీ అవినీతి పాలన పట్ల ప్రకృతి చేసింది మీరు గొప్పగా చెప్పుకునే కాలేశ్వరం ప్రాజెక్టు ఎన్నికల ముందే కూలిపోవడం చూసి ప్రజలు గద్ద దించారన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ సన్న బియ్యం ఇందిరమ్మ ఇండ్లు ఉచిత విద్యుత్ మహిళలకు ఉచిత బస్సు ఎందుకు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజాపాలన చూసి ఓర్వలేకే ఏది పడితే అది మాట్లాడుతున్నావని విమర్శించారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూడా నీవు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక బిఆర్ఎస్ అన్ని ఫెయిల్యూర్సే అన్నారు. మేనేజ్మెంట్ కోటాలో వచ్చి మంత్రి అయ్యా అన్నారు. రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్గా జడ్పిటిసి ఎమ్మెల్సీగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచి మీ నాయనతో ఛాలెంజ్ చేసి సీఎం అయిన విషయం ప్రజల అందరికీ తెలుసన్నారు.
2024 ఎంపీ ఎన్నికల్లో మీ పార్టీకి గుండు సున్నా వచ్చిందన్నారు.మీ నాయన కెసిఆర్ ని బ్రతిమిలాడి అసెంబ్లీకి తీసుకురా అంటూ హితువు పలికారు. లేకుంటే ప్రతిపక్ష నేత హోదా తీసుకొని నీవు అసెంబ్లీకి రావాలని సవాలు విసిరారు.
నీ మాటలు నీ కుటుంబానికి కరెక్ట్ గా సరిపోతాయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



