గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలించే బాధ్యత ప్రభుత్వాలదే : మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య
వీవైఎల్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
నవతెలంగాణ – ముషీరాబాద్
డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత బానిసలవుతున్నారని, ఇవి వారి శారీరక, మానసిక, ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేస్తాయని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య తెలిపారు. వీటిని శాశ్వతంగా సమాజం నుంచి నిర్మూలించడమే పరిష్కారమని, ఆ బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టంచేశారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ప్రచారంలో భాగంగా సోమవారం హైదరాబాద్ విద్యా నగర్‌లోని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) రాష్ట్ర కార్యాలయం మార్క్స్ భవన్ నుంచి ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ వరకు బైక్ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీకి గుమ్మడి నరసయ్య జెండా ఊపి ప్రారంభించారు. విద్యానగర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ రామ్‌నగర్ గుండు, వీఎస్టీ మీదుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు కొనసాగింది అనంతరం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో గంజాయి, డ్రగ్స్‌ల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పీవైఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ.. యువత గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండటమే కాకుండా చుట్టూ ఉన్న ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష, కార్యదర్శులు వీఎస్ కృష్ణ, కొల్లూరు భీమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మత్తు పదార్థాల పట్ల స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని, గంజాయి డ్రగ్స్ మాఫియాలపై కఠిన శిక్షలను విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి కుంభోజి కిరణ్, ఉపాధ్యక్షులు బంగారి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి బాలు, కొల్లూరు శంకర్, వి. సురేష్, కె. నరేందర్, జి. అంజి, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు యువత బానిస
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES