నవతెలంగాణ -పరకాల
పరకాల పోలీస్ స్టేషన్లో ఎస్సై సాక్షిగా ఓ యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించి పోలీసులు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన కథనం మేరకు వివరాలు ఈరోజు సాయంత్రం సమయంలో నడికూడ మండల కేంద్రంలోని వైన్ షాప్ ముందు కిన్నెర మల్లికార్జున్, తాళ్ల స్వామి రాజ్ వివాదం తలెత్తి ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో మల్లికార్జున్, తాళ్ల స్వామి రాజు పై పరకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.
దీంతో ఎస్సై రమేష్ స్వామి రాజును పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించే క్రమంలో స్వామి రాజు పోలీస్ స్టేషన్కు వచ్చి, ఎస్ఐ రమేష్ లేకపోవడంతో పవన్ అనే మరో ఎస్సై వద్దకు వెళ్లి తనపైనే దాడి చేసి తనపై మల్లికార్జున్ ఫిర్యాదు చేశాడు. ఇది పదే పదే జరుగుతున్నందున వాళ్ళ వేధింపులను తట్టుకోలేకపోతున్నానంటూ ఎస్ఐ ముందే తన వెంట తెచ్చుకున్న గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి పరకాల సీఐ క్రాంతికుమార్ వివరణ కోరగా శ్యామ్ రాజు పై పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు రావడంతో దర్యాప్తులో భాగంగా పిలిపించి మాట్లాడుతుండగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డడం జరిగింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సిఐ వెల్లడించారు.
పోలీస్ స్టేషన్ లో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES