Friday, October 31, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఇందిరా గాంధీ చిత్రపటానికి యూత్ కాంగ్రెస్ నాయకుల ఘన నివాళులు

ఇందిరా గాంధీ చిత్రపటానికి యూత్ కాంగ్రెస్ నాయకుల ఘన నివాళులు

- Advertisement -

నవతెలంగాణ – మందమర్రి
ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బి- 1 క్యాంప్ కార్యాలయం వద్ద ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పట్టణ యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్, ముడారపు శేఖర్ లు మాట్లాడుతూ.. తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ దేశ మహిళలకి ఆదర్శమని అన్నారు. ఆ కాలంలో విప్లవాత్మకమైన సంస్కరణలతో ప్రగతి పథంలో దేశాన్ని ముందుకు నడిపించిన గొప్ప యోధురాలు అని తెలిపారు.

తెలంగాణ ప్రాంతం మెదక్ నుండి ఎంపీగా ప్రాతినిథ్యం వహించడం తెలంగాణ వాసులుగా గర్విస్తున్నామని తెలిపారు. ఇందిరా సేవలను గుర్తించి ఆ రోజుల్లోనే భారతరత్న ఇవ్వడం హర్షించ దగిన విషయమన్నారు. గరీబ్ హటావో నినాదంతో 43రోజులు పాదయాత్ర నిర్వహించి ప్రజల్లో స్ఫూర్తిని నింపిన గొప్ప మహిళ అని, వారి స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల పట్ల ఎన్నో అభివృద్ధి పథకాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు జావిద్ ఖాన్, రహీం, ఒజ్జ గణేష్, చిలుముల మహేష్, రేగుంట కిరణ్, మెర్గు సతీష్,ధనుక్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -