Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువత తాత్కాలిక ఆనందం కొరకు జీవితాలు నాశనం చేసుకోవద్దు

యువత తాత్కాలిక ఆనందం కొరకు జీవితాలు నాశనం చేసుకోవద్దు

- Advertisement -
  • రాయపోల్ ఎస్ఐ కుంచం మానస..
    నవతెలంగాణ – రాయపోల్
  • గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాలకు బానిసై యువత తాత్కాలిక ఆనందం కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దని రాయపోల్ ఎస్ఐ కుంచం మానస అన్నారు. శనివారం రాయపోల్ మండల కేంద్రంలో నార్కోటిక్ డాగ్స్ తో  గంజాయి ఇతర మత్తుపదార్థాల నివారణ గురించి టీ కొట్టు, పాన్ షాపులు, కిరాణా షాపులు, ఇతర అనుమానాస్పద ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకుమండల కేంద్రంలో నార్కోటిక్ డాగ్స్ తో గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల నివారణ కోసం టీ కొట్టు, కిరాణం షాపులు ఇతర అనుమానాస్పద ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.

    గంజాయి ఇతర మత్తు పదార్థాలు  మరియు మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్స్ ఎవరైనా కలిగి ఉన్నా లేక అక్రమంగా రవాణా చేసిన పాన్ షాపులలో కానీ ఇతర షాపులలో అమ్మిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి ఇతర మత్తుపదార్థాల పై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, గంజాయి రహిత జిల్లా కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.యువత తాత్కాలిక ఆనందం కొరకు జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు.గంజాయి ఇతర మత్తుపదార్థాలు ఎవరైనా కలిగి ఉంటే అమ్మిన విక్రయించిన  వెంటనే డయల్ 100 లేదా తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్,1908 లేదా రాయపోల్ పోలీసులకు  సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డాగ్ స్క్వాడ్ సిబ్బంది అజయ్ కుమార్, శ్యాంసుందర్, రాయపోల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -