ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మే 31న జరుపుకునే ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం ముఖ్య ఉద్దేశం -పొగాకు వినియోగం వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను, మానసిక సమస్యలను ప్రపంచానికి గుర్తుచేయడం. అయితే ఇప్పటి పరిస్థితుల్లో యువత పొగాకు మాయలో చిక్కుకొని, వారి ఆరోగ్యాన్ని తమకు తామే నాశనం చేసుకుంటున్నారు. మానసిక దక్పథంలో పొగాకు వాడకానికి కారణాలను కొన్నింటిని నిఫులుగు గుర్తించారు. వాటిలో కొన్ని…
ఒత్తిడి నుంచి తాత్కాలిక ఉపశమనం
విద్య, ఉద్యోగం, కుటుంబ ఒత్తిడులు యువతను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ ఒత్తిడిని తట్టుకోలేక చాలామంది పొగాకు వైపు వాలుతున్నారు.
గుర్తింపు కోరిక – ‘గ్రూప్‌లో కలవాలన్న మనోభావం’
సామాజిక వాతావరణంలో ఇతరులతో కలవాలన్న కోరిక, గ్రూప్ ఒత్తిడి వల్ల కొందరు యువత పొగాకు ప్రారంభిస్తున్నారు.
వెబ్ సిరీస్, ఫ్రీ వెడ్డింగ్ షూట్ల ప్రభావం
ఇటీవల సోషల్ మీడియాలో పొగతాగే దశ్యాల్ని ‘స్టైల్’గా చూపిస్తూ, యువతను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటి ద్వారా ‘పొగతాగడం మామూలే’ అన్న అభిప్రాయం పెరుగుతోంది.
శారీరక, మానసిక సమస్యలు – డాక్టర్ల హెచ్చరికలు
పొగాకు వల్ల రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది. చిన్న వయసులోనే గుండెజబ్బులు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఇది ఇప్పుడు అకాల మత్యువులకు మూడో ప్రధాన కారణంగా మారింది.
పొగాకులోని నికోటిన్ మూలంగా ఆందోళన, ఒత్తిడి పెరగడం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గడం జరుగుతోంది. హెచ్‌ఐవి, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి ప్రమాదాలు పొగాకుతో ముడిపడ్డవే. శుక్రకణాల నాణ్యత తగ్గి, సంతాన ప్రాప్తి కష్టంగా మారుతుంది.
గర్భిణిలు పాసివ్ స్మోకింగ్‌కు గురైతే పిండం ఎదుగుదలకు తీవ్ర అడ్డంకులు కలుగుతాయి.
సైకాలజికల్ పరిణామాలు:
ఆత్మవిశ్వాస లోపం: తాను కూడా ‘గ్రూప్‌లో కలిసిపోవాలనే’ కోరికతో, ఇతరుల ఒత్తిడికి లోనవుతూ యువతీ, యువకులు పొగాకు మొదలుపెడతారు.
ఎదుగుతున్న దశలో గందరగోళం: టీనేజ్ దశలో తల్లిదండ్రుల అణచివేత, ఎమోషనల్ గ్యాప్, నిర్లక్ష్యం వంటివి పిల్లల మనసులో అసంతప్తిని పెంచుతూ, పొగాకు వంటి అలవాట్లవైపు దారి తీస్తాయి.
తాత్కాలిక ఉపశమనం కోసం తప్పుదారి: ఒత్తిడి, బాధ, నిరాశ వంటి మానసిక స్థితుల నుంచి తాత్కాలిక రిలీఫ్ కోసం చాలామంది పొగాకు వైపు మొగ్గు చూపుతారు.
సోషియల్ ఇసొలేషన్: కుటుంబ సభ్యులు, సమాజం తలచిన విధంగా స్పందించకపోవడం వల్ల కొందరు ఒంటరితనానికి గురవుతారు.
డిప్రెషన్: పొగాకు తీసుకోవడం వల్ల డిప్రెషన్ తగ్గుతుందని అనుకొని మొదలుపెట్టి, చివరికి అదే డిప్రెషన్‌ను పెంచే కారణంగా మారుతుంది.
కుటుంబ బాధ్యత – తల్లిదండ్రుల పాత్ర
పిల్లల జీవితాల్లో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో ఎక్కువ. వారు పిల్లల వైఖరిని గమనించకుండా ఉండటం, వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకోకపోవడం వల్ల పొగాకు అలవాటు ఏర్పడుతుంది.
‘పిల్లల జీవితాల్లో సెగ పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే’
పిల్లలు పోషకాహార లోపంతో ఇప్పటికే బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో పొగాకు వల్ల ఆరోగ్యం మరింత దెబ్బతింటోంది.
వ్యాపార ప్రయోజనాల కోసం యువత లక్ష్యం
పొగాకు పరిశ్రమలు ప్రగతిశీల యువతను టార్గెట్ చేస్తూ, ఆకర్షణీయ ప్రకటనలు, హుక్కా లౌంజ్‌లు, ఈ-సిగరెట్లు వంటి ఆకర్షణల ద్వారా మన దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి.
-ఊపిరితిత్తుల, నోటి క్యాన్సర్
– గుండెపోటు, వినికిడి సమస్యలు
– ఊపిరి సమస్యల వల్ల నిద్రలేమి, వయసు కంటే ముందే శారీరక బలహీనత
– ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, పొగాకు వల్ల జీవన కాలం పదేళ్ల వరకూ తగ్గవచ్చు.
మానసికంగా గెలవడమే మార్గం
విజన్ కోసం మిషన్: యువత సరైన లక్ష్యాలు ఏర్పరుచుకుని జీవితం పట్ల ధైర్యంగా ముందుకు సాగితే, ఇలాంటి వ్యసనాల అవసరమే ఉండదు.
అవగాహన చిన్న వయసులోనే ప్రారంభించాలి: పిల్లలకు స్కూళ్లలోనే పొగాకు వినియోగం మానసిక ప్రభావాలపై సరైన అవగాహన కల్పించాలి.
సైకోథెరపీ, కౌన్సెలింగ్: పొగాకు వాడకాన్ని మానసిక అలవాటు గానే కాక, ఒక డీప్ రూటెడ్ ఎమోషనల్ సమస్యగా పరిగణించి కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించాలి.
పాజిటివ్ కోపింగ్ మెకానిజంలను నేర్పాలి: యోగా, మెడిటేషన్, ఆర్ట్, స్పోర్ట్స్ వంటి ఆరోగ్యకర మార్గాలవైపు యువతను ప్రోత్సహించాలి.
పొగాకు వినియోగాన్ని శారీరక సమస్యగా మాత్రమే కాక, మానసిక సమస్యగా గుర్తించి, దాని నివారణకు మానసిక స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వ్యక్తి మానసికంగా బలంగా ఉండగలిగితేనే, అలాంటి వ్యసనాలకు భయపడాల్సిన అవసరం లేదు.
అవగాహన కార్యక్రమాలు: స్కూళ్లు, కళాశాలల్లో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచే ప్రయత్నాలు జరిగితే, ఈ అలవాట్లను తుడిచేయొచ్చు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రేరణగా మారాలి – పిల్లలకు సరైన మార్గనిర్దేశనం చేయాలి.
పొగాకు వాడకం ఒక్క వ్యక్తికి కాదు, ఒక కుటుంబానికి మానసిక, ఆర్థిక, శారీరక విషాదాన్ని తెస్తుంది. నేడు మనం ఎంచుకునే నిర్ణయం, మనం రేపు ఉండే ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.
పొగాకు నుంచి దూరంగా ఉండండి. జీవితాన్ని వెలుగుతో నింపండి.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం, పొగాకు వాడకం వల్ల భారతదేశం ప్రతి సంవత్సరం దాదాపు 1% స్థూల దేశీయోత్పత్తి (GDP) నష్టపోతుంది. ఈ ఆర్థిక నష్టం ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, ఉత్పాదకత కోత, అకాల మరణాల వల్ల కలుగుతుంది.
2024లో ప్రచురితమైన KPMG నివేదిక ప్రకారం, 20-44 ఏళ్ల వయసు గల యువతలో సుమారు 49% మంది పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారని వెల్లడించబడింది. ఇది భారతదేశంలో పొగాకు వినియోగం కారణంగా కలిగే ఆర్థిక నష్టాన్ని మరింత పెంచుతోంది.
ఈ పరిస్థితిని దష్టిలో ఉంచుకుని, పొగాకు నియంత్రణ చర్యలను బలోపేతం చేయడం, అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, యువతలో పొగాకు వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయడం అత్యవసరం.
ఈ మే 31న మనమంతా ఒక నిర్ణయం తీసుకుందాం. పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం. మానసిక ఆరోగ్యాన్ని పటిష్టం చేయడం ద్వారానే అది సాధ్యమవుతుంది.
డా|| హిప్నో పద్మా కమలాకర్, 9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్
పొగాకులో మసకబారుతున్న యువత
- Advertisement -
- Advertisement -