Thursday, February 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమార్చి ఒకటి నుంచి యువజనోత్సవాలు

మార్చి ఒకటి నుంచి యువజనోత్సవాలు

- Advertisement -

భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ 95వ వర్ధంతి కార్యక్రమాలు
పోస్టర్‌ ఆవిష్కరించిన ఏఐవైఎఫ్‌ నేతలు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
దేశం కోసం ప్రాణాలర్పించిన షహీద్‌ భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల 95వ వర్ధంతిని పురస్కరించుకుని మార్చి ఒకటి నుంచి 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యువజనోత్సవాలను నిర్వహించాలని ఏఐవైఎఫ్‌ నిర్ణయించింది. బుధవారం హైదరాబాద్‌, హిమయత్‌నగర్‌లో యువజనోత్సవాలకు సంబంధించిన పోష్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా యువజనోత్సవాలను (స్టాప్‌ డ్రగ్స్‌-స్ట్రాట్‌ స్పోర్ట్స్‌, క్రికెట్‌, కబడ్డీ, వాలీబాల్‌ పోటీలు, వ్యాసరచన, చిత్రలేఖన, ఉపన్యాస పోటీలు, రక్తదాన శిబిరాలను, యువ కవి, గాయకుల సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు,ప్రముఖుల సందేశాలు) ఘనంగా నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర వెల్లడించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ రాష్ట్ర నాయకులు నెర్లకంటి శ్రీకాంత్‌, బిజ్జ శ్రీనివాసులు, టి.సత్య ప్రసాద్‌, పేరబోయిన మహేందర్‌, యుగంధర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్‌ మహమూద్‌, సల్మాన్‌ బేగ్‌, పి.శివకుమార్‌, ఎల్లంకి మహేష్‌, మార్కపూరి సూర్య,మానస్‌ కుమార్‌, సురేందర్‌, మస్క సుధీర్‌, వెంకటేష్‌, మధుకర్‌, జెట్టి శ్రీను, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -