- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : విశాఖలోని గంగవరం బీచ్ సమీపంలోని మాధవస్వామి టెంపుల్ వద్దకు ఒడిశాకు చెందిన నలుగురు యువకులు సందర్శనకు వెళ్లారు. వారిలో రూపక్ సాయి అనే యువకుడు బీచ్ వద్ద రాళ్లపై నిలబడి ఉండగా.. ఒక్కసారిగా ఎగసిపడిన కెరటాల తాకిడికి సముద్రంలో గల్లంతయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న న్యూపోర్ట్ పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకుడు పెదగంట్యాడ మండలం సీతానగరంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -



