- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: బోడుప్పల్ లోని గ్రీన్ వుడ్ టెక్నో స్కూల్ నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో యూత్ ఐకాన్ వినయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చైర్మన్ కృష్ణ శ్రీకర్, ప్రిన్సిపల్ హరిత లతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్య, కరాటే ప్రదర్శనలు, పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం వినయ్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని నైపుణ్యాలని, కళలను ప్రోత్సహించడం గొప్ప విషయమన్నారు. చైర్మన్ కృష్ణ శ్రీకర్, ప్రిన్సిపల్ హరిత చేస్తున్న కృషి అభినందనీయమని ఇంత మంచి కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు వినయ్ కుమార్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వినయ్ కుమార్ ని పాఠశాల యాజమాన్యం అందరు కలిసి ఘనంగా సత్కరించారు.


- Advertisement -



