- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒక యువకుడికి కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించడం జరిగిందని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. ఈ కేసును విచారించిన ద్వితీయ శ్రేణి మేజిస్ట్రేట్ టి. చంద్రశేఖర్ నిందితుడికి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.2000 జరిమానా విధించారన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.
- Advertisement -



