Sunday, March 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువత సామాజిక సేవలో ముందుండాలి

యువత సామాజిక సేవలో ముందుండాలి

- Advertisement -

 ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  బీర్ల అయిలయ్య
నవతెలంగాణ – ఆలేరు టౌను 

యువత సామాజిక సేవలు ముందుండాలని రాష్ట్ర ప్రభుత్వ  విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరు పట్టణంలో మేరా యువభారత్ నల్గొండ వారి సహకారంతో ఫ్రెండ్స్ క్లబ్  ఆధ్వర్యంలో యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రాం,ప్రపంచ మంచినీటి పొదుపు దినోత్సవం,స్వచ్ఛభారత్ ,స్వతంత్ర అమరవీరుల స్మారక దినోత్సవం ఆదివారం నిర్వహించారు. 10 యువజన సంఘాలకు సంఘాలకు స్పోర్ట్స్ మెటీరియల్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మహిళా కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బండ్రు శోభారాణి    చేతుల మీద అందజేశారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేశారు. యువత సామాజిక సేవ చేయడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర సమరయోధుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని యువత మంచి కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు పూల నాగయ్య అధ్యక్షత వహించారు. ఇటీవల క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులకు  ప్రశంసా పత్రాలు ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజాని బలమని భాస్కర్, మేరా యువభారత్ -నల్గొండ జిల్లా అధికారి రాజేష్ ,యాదగిరి ,సందీప్ నాయక్,పిసిసి సెక్రెటరీ  జనగాం ఉపేందర్ రెడ్డి ,ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండరాజు  వెంకటేశ్వర్ రాజ్,  యువజన సంఘాల సమితి అధ్యక్షులు     తాళ్లపల్లి మహేష్,  పూల శ్రవణ్ కుమార్, ఎస్  సాయి, బి రంజిత్, భాను, రామ్ శివాజీ యూత్ సభ్యులు,వివిధ గ్రామాల యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -