నవతెలంగాణ – ఆర్మూర్
విద్యార్థులు యువత క్రీడల్లో ముందుండి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. తెలంగాణ క్రీడా శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్స్ సీఎం కప్-2025 టార్చ్ ర్యాలీ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం 56 ఏళ్ల వయసులో ప్రపంచ క్రీడాకారులతో ఫుట్బాల్ మ్యాచ్లో ప్రతిభ కనపరిచారని అన్నారు.
నేడు విద్యార్థులు యువత గంజాయి, గుల్పారం లకు బానిసలు కాకుండా ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ప్రావీణ్యం పొంది పిటి ఉష లాగా, సింధు లాగా ఉన్నత స్థానంలోకి వెళ్లాలని, అన్నిటికీ ఒక్కటే విజయమని గెలుపు , ఓటమిలకు అతీతంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శివాజీ, ఎంఈఓ రాజగంగారం, పి ఆర్ ఏ ఈ నితీష్ , ఏ పీ ఓ సురేష్, ఏపిఎం భూమేశ్వర్ గౌడ్, ఎంపీడీవో కార్యాలయ సూపర్డెంట్ లక్ష్మి, పంచాయితీ సెక్రటరీలు భార్గవి, సుకన్య , వ్యాయమా ఉపాధ్యాయులు గంగాధర్, గోపిరెడ్డి, మల్లేష్ గౌడ్, మధు ,రాజేశ్వర్, వివిధ పాఠశాలల ప్రాధనో ఉపాధ్యాయులు, వివిధ గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.



