యువత మత్తుకు బానిసలు కాకూడదు
పద్మ సుదర్శన్, ఐఎఫ్టి యు జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ – ఆలేరు రూరల్
బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలర్పించిన వీర అమర యోధులు కామ్రేడ్స్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల పోరాట స్ఫూర్తితో నేటి యువత ప్రజా క్షేత్రంలో ఉండాలని, మత్తుకు బానిసలు గా మారితే వ్యక్తిగతంగా నే కాకుండా ప్రజలకు అన్యాయం చెడినవాలవుతారని, భవిష్యత్ అంతా అంధకారం అవుతుందని ఐఎఫ్టి యు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్ అన్నారు. కామ్రేడ్స్ భగత్ సింగ్ రాజ్ గురు, సుఖ్ దేవ్ లో 95 వ వర్ధంతి ఆలేరు మండలం మందనపల్లి లో ఘనంగా జరిపారు.
ఈ సందర్భంగా కామ్రేడ్ భగత్ సింగ్ విగ్రహానికి సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ గ్రామ కార్యదర్శి తమ్మడి అంజయ్యతో పాటు పద్మ సుదర్శన్, దొంకెన శ్రీహరి కార్యక్రమానికి హాజరైన వాళ్ళందరూ పూలమాలలు,క్రొవ్వత్తు లతో మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ.. కామ్రేడ్ భగత్ సింగ్ బ్రిటీష్ వాడిని తరిమి కొట్టడమే కాకుండా, సమానత్వం తో కూడిన సోషలిజం రావాలని కోరుకున్నాడని, ఆ వెలుగులో తన పోరాటానికి పదునుపెట్టాడని అన్నారు. భగత్ సింగ్ తన చిన్న తనంలోనే నేల లోపట విత్తనం పెడితే మొలకెత్తి పంట నిచ్చినట్లుగా, బాంబులను కూడా భూమిలో నాటితే బాంబులు కూడా వస్తాయా అని తన బంధువులతో మాట్లాడం ఎంత చైతన్యమో అర్థం చేసుకోవాలని అన్నారు.
పీ డీ ఎస్ యు జిల్లా నాయకులు ఆర్.ఉదయ్ మాట్లాడుతూ.. పిచ్చోడి చేతిలో రాయిలా ప్రవర్తిస్తూ ప్రపంచ దేశాలపై ముఖ్యంగా ఇరాన్ పై అధర్మ యుద్ధం చేస్తూ దేశాధ్యక్షున్ని హత్యచేయడాన్ని యువత తీవ్రంగా ఖండిస్తూ ముందుకు సాగాలని అన్నారు. ఇతర దేశాల సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకుంటూ ఆ దేశాల సంపదను, ప్రధానంగా చమురు నిల్వలను దోచుకోవడానికి సృష్టిస్తున్న కృత్రిమ యుద్దాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, ప్రజా సంఘాల నాయకులు ఆర్.జనార్ధన్, ఆర్.సీత, గ్రామ ఉప సర్పంచ్ పద్మ శశిరేఖ, పీ ఓ డబ్ల్యూ నాయకులు తమ్మడి ఉమ, కడకంచి పద్మ, శాతర్ల స్వరూప, కడకంచి అనిత, పద్మ సింధూ, సిరిమర్తి శాంతమ్మ, సోని, నాయకులు కడకంచి సత్తయ్య, కుర్రి మార్కండేయ, తమ్మడి రమేష్, కడకంచి రమేష్, సుంచు రాములు, దార యాదగిరి, కడకంచి అంజయ్య, కడకంచి బీరయ్య, కొమ్మిడి గోపాల్ రెడ్డి, గోవింద్ పరమేశ్, కడకంచి మధు, తమ్మడి చరణ్, కొమ్మిడి శ్రీకాంత్ రెడ్డి, కొమ్మిడి నర్సింహారెడ్డి, దడిగా మధు, పద్మ బాలు తదితరులు పాల్గొన్నారు.



