Saturday, November 1, 2025
E-PAPER
Homeఆదిలాబాద్స్వయం ఉపాధి దిశగా యువత ముందుకు రావాలి: కలెక్టర్

స్వయం ఉపాధి దిశగా యువత ముందుకు రావాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్: ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి అవకాశాలను యువత పూర్తిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలో టీటీడీసీ భవనంలో నిర్వహించిన ఇందిరమ్మ సెంట్రింగ్ యూనిట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. శిక్షణ పొందిన యువత నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించుకుని స్వయం ఉపాధి సాధించాలని సూచించారు. నిర్మాణ రంగంలో నైపుణ్యం కలిగిన కార్మికులను తీర్చిదిద్దడంలో ఈ శిక్షణ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. కష్టపడి నేర్చుకుంటే ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు తప్పక లభిస్తాయని, జిల్లాలో ఇలాంటి మరిన్ని శిక్షణా కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని  తెలిపారు. సందర్భంగా శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా మాట్లాడుతూ, శిక్షణ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోందని, మహిళలు కూడా ఈ రంగంలో ముందుకు రావాలని సూచించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు కలెక్టర్ సర్టిఫికేట్లు అందజేశారు. కార్యక్రమంలో డిఆర్డిఓ డిపిఎం, ఎపిఎం, న్యాక్ ఏడి స్వప్న రాణి, ఇతర అధికారులు, న్యాక్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -