Saturday, November 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువత అన్ని రంగాల్లో రాణించాలి..

యువత అన్ని రంగాల్లో రాణించాలి..

- Advertisement -

అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్..
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

యువత చదువులోనే కాకుండా, సంస్కృతి ,కళలలు, సాహిత్యం, పేయింటింగ్ రంగాలలో రాణించాలని రెవెన్యూఅదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అన్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 2025- 26 జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను శనివారం ఆయన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ప్రారంభించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఉత్సవాలను ప్రారంభించారు.   యువతను ఉద్దేశించి అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి యువత తమ ప్రతిభను వెలికి తీసి దేశ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని, స్వామి వివేకానంద ను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు.

యువత శక్తివంతంగా ఉంటే దేశం శక్తివంతంగా ఉంటుందని, మీభవిష్యత్తును నిర్ణయించి శక్తి మీలోనే ఉందని, స్వామి వివేకానంద బోధనలు ప్రతి యువతలో దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంచుతాయని అన్నారు. గమ్యస్థానం చేరుకునే దాకా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, మీలో ఉన్న ఉత్తేజం దేశానికి, శక్తికి ప్రతిక కావాలని, యువత చదువులోనే కాకుండా సంస్కృతి, కళలలు, సాహిత్య రంగంలో రాణించాలని, వివేకానందుడు ప్రపంచానికి భారతీయ సంస్కృతి, విలువలు, యువత శక్తిని గుర్తు చేసిన మహానుభావుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడ ల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ, కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కాలేజీ ప్రిన్సిపల్ ఉపేందర్, ఒకేషనల్ ప్రిన్సిపల్ రాకేంద్ ,నాగార్జున డిగ్రీ ఓపెన్ కళాశాల ప్రిన్సిపల్ బొజ్జ అనిల్ , కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ మనిషా సింగ్, బాలు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -