Friday, February 13, 2026
E-PAPER
Homeఆదిలాబాద్యువత క్రీడల్లో రాణించాలి: సర్పంచ్ విజయ లక్ష్మణ్

యువత క్రీడల్లో రాణించాలి: సర్పంచ్ విజయ లక్ష్మణ్

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
యువత క్రీడల్లో రాణించాలని గ్రామ సర్పంచ్ విజయ లక్ష్మణ్ అన్నారు శుక్రవారం మండలంలోని మలక్ చించోలి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించి మాట్లాడారు. యువత చదువుతో క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యం తో పాటు స్నేహ సంబంధాలు మెరుగు పడతాయన్నారు. ముందుగా క్రీడాకారులకు క్రికెట్ కిట్ అందజే క్రికెట్ పోటీలు ప్రారంభించారు.

ఈ పోటీలు 4 రోజులపాటు కొనసాగుతాయి. ఈ పోటీల్లో 8 జట్లు పాల్గొననున్నాయి.  గెలుపొందిన జట్లకు గ్రామానికి చెందిన బంగ్లా చిన్న గంగయ్య జ్ఞాపకార్థం మొదటి బహుమతి రూ.8100/-,రెండవ బహుమతి, ఎక్కిలేరి మల్లయ్య జ్ఞాపకార్థం రూ.5100/- మూడవ బహుమతి గ్రామ ఉప సర్పంచ్  దాసరి జ్యోతి మల్లేష్ రూ. 2500/- అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి సంధ్యారాణి ,నాయకులు దాసరి మల్లేష్,కారోబర్ భోజన్న,గ్రామ పెద్దలు క్రీడాకారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -