Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం కప్ పోటీలను యువకులు విజయవంతం చేయాలి

సీఎం కప్ పోటీలను యువకులు విజయవంతం చేయాలి

- Advertisement -

గుర్రంపేట సర్పంచ్ కోడూరి రమేష్ 
నవతెలంగాణ – భూపాలపల్లి

గుర్రంపేట గ్రామంలోని ఆసక్తి గల యువకులు సీఎం కప్ క్రీడలలో పాల్గొని విజయవంతం చేయాలని సర్పంచ్ కోడూరు రమేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడలలో భాగంగా గ్రామాలలోని యువతి యువకులలో నైపుణ్యం కలిగి క్రీడాకారులు రెవెన్యూ గ్రామమైన పెద్దాపూర్ గ్రామంలో జరిగే కబడ్డీ, కోకో, వాలీబాల్  వివిధ రకాల క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. 

కావున ఆసక్తి ఉన్న యువతీ యువకులు గుర్రంపేట గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శి దగ్గర పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దామెరుప్పల సుధాకర్, వార్డు మెంబర్లు దూడపాక అరవింద్, కొర్ర అంబిక. దామెరుప్పల సుమలత, కొర్ర శ్రీను, రత్నం సురేష్,  ప్రభుత్వ అధికారులు, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, పోలీస్ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -