Friday, October 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్Drugs: యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి

Drugs: యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి

- Advertisement -

కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేష్

నవతెలంగాణ-మల్హర్ రావు

గంజాయి,మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గంజాయి, డ్రగ్స్ వాడకంతో కలుగుతున్న అనర్థాలను దృష్టిలో పెట్టుకొని యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. చదువుకునే వయస్సులో మత్తు పదార్థాలలు అలవాటు పడి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పినట్టుగా విని చదువులు, ఆటపాటల్లో ఉన్నత శిఖరాలను అవరోధించి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -