నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని జువ్వాడి గ్రామానికి చెందిన రవికుమార్ 6 ప్రభుత్వ ఉద్యోగాలు రాగ ఇటీవల గ్రూప్2 కు కూడ సెలెక్ట్ కావడం జరిగింది. విషయం తెలిసిన జువ్వాడి గ్రామస్తులు రవికుమార్ ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగాగ్రామస్తులు మాట్లాడుతూ.. పేద కుటుంబంలో జన్మించి ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకొని అంచెలంచెలుగా గ్రూప్ 2 వరకు ఎదగడం జరిగింది. వారిని చూస్తే చదువుకు పేదరికం అడ్డుకాదు అనిపిస్తుంది .వారిని ఆదర్శంగా తీసుకుని యువత కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలలో రాణించాలని గ్రామస్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ గుర్రం బాలయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బద్దం వెంకట్ రెడ్డి, బీజేపి జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీకాంత్, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు శ్యామ్, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు భూమేష్, గుర్రం సంతోష్, చాకలి సాయిలు, బద్దం రాజారెడ్డి, మోహన్, సంతోష్,గంగారాం,మహేందర్, అన్వేష్ భాను సాగర్,ప్రవీణ్,సాగర్,విజయ్,సాగర్ తదితరులు పాల్గొన్నారు.
యువత రవి కుమార్ ను ఆదర్శంగా తీసుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES