Wednesday, November 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు యువత కృషి చేయాలి

గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు యువత కృషి చేయాలి

- Advertisement -

– సైబర్‌ నేరగాళ్లు, బెట్టింగ్‌ యాప్‌లతో జాగ్రత్త : ఫలక్‌నుమా సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సీతయ్య, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌
నవతెలంగాణ – ధూల్‌ పేట్‌

యువత గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు కృషి చేయాలని ఫలక్‌నుమా సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సీతయ్య, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్‌ అన్నారు. సైబర్‌ నేరగాళ్లు, బెట్టింగ్‌ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌ జంగంమెట్‌ రవీంద్ర నాయక్‌నగర్‌ కాలనీ బంజారా వెల్ఫేర్‌ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ ప్రెసిడెంట్‌ ఈ.కృష్ణ నాయక్‌ అధ్యక్షతన మంగళవారం బంజారా వెల్ఫేర్‌ కమ్యూనిటీ హాల్‌లో గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. యువత గంజాయి, డ్రగ్స్‌ జోలికి వెళ్లకుండా భవిష్యత్‌ను అందంగా నిర్మించుకోవాలని సూచించారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకుని ఉన్నత స్థాయిలో నిలవాలన్నారు. యువత చెడు దారి వైపు వెళ్లొద్దన్నారు. సైబర్‌ నేరగాళ్లతో జాగ్రత్త ఉండాలని, బెట్టింగ్‌ యాప్స్‌ జోలికి వెళ్లొద్దని సూచించారు. అనగంటి వెంకటేష్‌ మాట్లాడుతూ.. ఎక్కువ శాతం యువకులు గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్ధాల వైపు చూడకుండా మంచి భవిష్యత్‌ కోసం కలలు కని, దాన్ని సాధించుకోవాలని సూచించారు. ఉన్నత చదువులు చదివి సమాజ మార్పు కోసం ఆదర్శంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలక్‌నుమా ఎస్‌ఐ రాజేశ్వర్‌ రెడ్డి, కాలనీ పెద్దలు శంకర్‌ నాయక్‌, రాజేష్‌, సురేష్‌, రవి, సోమల, దాస్య, శంకర్‌, ఆంజనేయులు మోతిలాల్‌ చత్రువు శ్రీను రాజేష్‌ భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -